ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. ఎయిర్‌పోర్ట్‌లో నిలిచి ఉన్న ఆకాశ ఎయిర్ విమానం వెనుక భాగాన్ని కార్గో కంటైనర్ వాహనం ఢీకొట్టింది. దీంతో ఒంగిన ఆ రెక్క వాహనంలోకి చొచ్చుకుపోవడంతో విమానం వెనుక భాగం వైపు ఉన్న రెక్క దెబ్బతిన్నది. సమాచారం అందుకున్న అధికారులు పరిస్థితిని తనిఖీ చేస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.