TG: చెన్నూరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదైంది. సింగరేణి ఆస్తులను తగలబెట్టాలని, కూల్చివేయాలని, మిలిటెంట్ యాక్టివిటీ చేపట్టాలంటూ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని నాంపల్లి పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. దీంతో బాల్క సుమన్ పై సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు.