తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి తనను కించపరచారంటూ సినీ నటి మాధవి లత, జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సైబరాబాద్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కాగా న్యూఇయర్ వేడుకల సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, మాధవి లత మధ్య మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే.