మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌కు ఉచ్చు బిగుస్తోంది. ఈ ఫార్ములా-ఈ రేస్ నిధుల బదలాయింపుపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. న్యాయ నిపుణుల సలహా తీసుకుని విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లు వివరించారు. సీఎస్ ద్వారా ఏసీబీకి లేఖ పంపుతామని వెల్లడించారు. అయితే కేటీఆర్ అరెస్ట్‌పై తాను ఇప్పుడే ఏమీ చెప్పలేనని అన్నారు.