మంత్రి పొంగులేటి కుమారుడి కంపెనీపై కేసు నమోదు

TG: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు రాఘవకు షాక్ తగిలింది. గండిపేట రెవెన్యూ పరిధి వట్టినాగులపల్లిలో రూ.300 కోట్ల విలువైన భూమి కబ్జాకు రాఘవ కనస్ట్రక్షన్స్ కంపెనీ యత్నించింది. నవంబర్ 30న 70 మంది బౌన్సర్లను తీసుకెళ్లి ఆ భూమి చుట్టూ ఉన్న ప్రహరీని కూల్చివేసి, స్థల యజమానిపై దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. పల్లవి షా అనే మహిళ ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్