TG: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి ఘటనలో ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదైంది. మల్లన్న ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కవితపై కేసు నమోదు చేశారు. కవిత ప్రోద్బలంతోనే ఆమె అనుచరులు, కార్యకర్తలు తన కార్యాలయంపై, తనపై దాడి చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు 50 మంది కవిత అనుచరులు మారణాయుధాలతో తనపై దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించారన్నారు. బీసీ ఉద్యమ నాయకులకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో కోరారు.