శశాంక్ సింగ్‌పై కేసు నమోదు

పంజాబ్ కింగ్స్ ఆటగాడు శశాంక్ సింగ్, ఆయన తండ్రి శైలేష్ సింగ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్‌లోని రేవాకు చెందిన విపేంద్ర సింగ్ అనే వంట మనిషి శశాంక్ సింగ్ ఇంట్లో  పనిచేస్తున్నారు.  ఈ క్రమంలో వారు పనిమనిషికి 15 వేల జీతం, వసతితో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించారు. పనిలో చేరిన నాలుగు రోజులకే, వంట బాగోలేదని శశాంక్ కుటుంబం అతన్ని దూషించి, కొట్టింది. బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తే శశాంక్, అతని తండ్రి, డ్రైవర్ కలిసి విపేంద్రపై భౌతిక దాడి చేశారని బాధితుడు ఆరోపించారు.
CREDITS: ANI

సంబంధిత పోస్ట్