బిహార్‌లోని మొకామా ఎమ్మెల్యే అనంత్ సింగ్ కుమార్తె శివాంగి వివాహ వేడుకలో కరెన్సీ నోట్లను విచ్చలవిడిగా వెదజల్లిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతిథుల కోసం ఏర్పాటు చేసిన కచేరీలో భాగంగా స్టేజీపై పెద్ద ఎత్తున నోట్లను కురిపించారు. నోట్ల కట్టలు పేరుకుపోవడంతో, నిర్వాహకులు వాటిని చీపుర్లతో ఊడ్చి పక్కకు తీశారు. కరెన్సీ నోట్లను అవమానకరంగా ప్రదర్శించడంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటన వీడియోలు ప్రస్తుతం అంతటా చర్చనీయాంశంగా మారాయి.