ఆముదం పంట నుంచి ఉత్పత్తి అయ్యే అత్యంత ప్రమాదకరమైన ‘రైసిన్’ అనే విష పదార్థంతో బయో వార్ చేయాలని ఉగ్రవాది సయ్యద్ మొయినుద్దీన్ కుట్ర పన్నినట్లు గుజరాత్ ఏటీఎస్ తెలిపింది. చైనాలో ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు రైసిన్ తయారీ గురించి తెలుసుకున్న అతను, దేవాలయాలు, వాటర్ ట్యాంకులు, ఆహార కేంద్రాల్లో దీన్ని కలిపి సామూహిక హత్యలకు ప్రణాళిక వేసాడు. మొయినుద్దీన్ అరెస్టుతో ఈ కుట్ర బయటపడింది. రైసిన్‌కు విరుగుడు లేకుండా, ఇది ఎముకలను కూడా కరిగించే విషపదార్థం.