ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ఈనెల 20 నుంచి మే 15 వరకు రెండు వారాల పాటు యూరప్, యూకే వెళ్లేందుకు ఆయన కోర్టు అనుమతి కోరారు. ఈ అనుమతితో పాటు రూ.లక్ష పూచికత్తు సమర్పించాలని సీబీఐ కోర్టు జగన్ను ఆదేశించింది.