కాళేశ్వరం ప్రాజెక్టుపై కోర్టు తీర్పుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కమిషన్ నియామకం ఏకపక్షమని కోర్టు ఎక్కడా చెప్పలేదని, చట్టవిరుద్ధమని కేసీఆర్, హరీష్ రావు అన్నారని, కానీ కమిషన్ నియామకం చట్టబద్ధమేనని, జీవో కొట్టేయడం కుదరదని కోర్టు చెప్పిందని ఆయన తెలిపారు. సెక్షన్ 8B, 8C ప్రకారం ప్రస్తుతం చర్యలు వద్దని మాత్రమే కోర్టు చెప్పిందని, కమిషన్ నివేదిక యధాతథంగా కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరంపై తక్షణమే సీబీఐ విచారణ జరపాలని, లేకపోతే భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటామని, ఢిల్లీ వెళ్లి సీబీఐ డైరెక్టర్‌ను కలుస్తామని ఆయన తెలిపారు.