ఫిబ్రవరి 15 నుంచి సీబీఎస్ఈ పరీక్షలు

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) నిర్వహించే 10, 12 తరగతుల ఫైనల్‌ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమవుతాయి. పదో తరగతి పరీక్షలు మార్చి 18తోనూ, పన్నెండో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 4తోనూ ముగుస్తాయి. ఈ మేరకు సీబీఎస్‌ఈ బుధవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రెండు సబ్జెక్టుల పరీక్షల తేదీల మధ్య తగినంత వ్యవధిని ఇచ్చినట్లు తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్