ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లా కొల్హుయి ప్రాంతంలో ఒక బట్టల దుకాణంలో పనిచేసే ఉద్యోగిపై ఒక వ్యక్తి అత్యంత దారుణంగా దాడికి తెగబడ్డాడు. ఈ ఘోరమైన దాడికి సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడి సిసిటివి కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ప్రశాంతంగానే ఉందని, నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
CREDITS: @NEWS1india