కర్ణాటకలోని ఉడుపి జిల్లా, పిలార్ గ్రామంలో తాజాగా దారుణ హత్య జరిగింది. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ చర్చి ఎదుట మాజీ గ్రామ పంచాయతీ అధ్యక్షుడు డిసౌజాను అపరిచిత వ్యక్తులు పాయింట్ బ్లాంక్‌లో తుపాకీతో కాల్చి చంపారు. కారు డోర్ తీస్తుండగా వెనుక నుంచి వచ్చిన దుండగుడు తలపై కాల్పులు జరిపి బైక్‌పై పరారయ్యాడు. గాయాలపాలైన ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.