గుజరాత్‌లోని సూరత్ దిందోలి ప్రాంతంలో అతివేగంగా వచ్చిన కారు ప్రమాదాన్ని సృష్టించింది. ఒకేసారి వరుసగా ఐదు వాహనాలను బలంగా ఢీకొట్టడంతో ఒక వృద్ధుడికి తీవ్ర గాయాలవ్వగా, మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం స్మిమర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడైన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.