TG: హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-విజయవాడ హైవే దాటుతున్న ఇద్దరు దంపతులను ఓ లారీ భారీ వేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో భార్యా భర్తలిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. మృతులను తూప్రాన్ పేట (యాదాద్రి భువనగిరి)కు చెందినవారీగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం.