50 మందితో దాడి ఘటన.. వెలుగులోకి సీసీ ఫుటేజ్

TG: మేడ్చల్ జిల్లా బోడుప్పల్ దేవేందర్ నగర్‌లో ఓ ఇంటిపై దుండగులు  దాడి చేసిన విషయం తెలిసిందే. నగరవాసి శ్యామ్‌రావు దేవేందర్‌నగర్‌లో ఇల్లు కొనుగోలు చేసి గృహప్రవేశం చేశారు. ‘మీకు ఇల్లు ఎవరు అమ్మారు? మా ఏరియాలో ఎలా కొంటారు?' అని రాత్రి స్థానికుడు యాకయ్య వారితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం తన కుమారుడికి చెప్పి 50 మందితో దాడికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. అడ్డుకున్న పక్క ఇంటి వారు, శుభకార్యానికి వచ్చిన వారి మీద అటాక్ చేశారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్