మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లా భూమ్ పట్టణంలో ఇద్దరు రౌడీలు వీరంగం సృష్టించారు. పెట్రోల్ పోయించుకుని డబ్బులు అడిగినందుకు ఒక పెట్రోల్ బంక్ ఉద్యోగిపై కొడవలితో దాడి చేశారు. ఈ ఇద్దరు యువకులు గతంలోనూ పలు హింసాత్మక ఘటనలకు పాల్పడగా, తాజా దాడికి సంబంధించిన భయానక దృశ్యాలన్నీ పెట్రోల్ బంక్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.