కేరళలోని పాలక్కాడ్ జిల్లా కొళింజాంపరలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఒక వృద్ధుడిని వేగంగా వచ్చిన స్కూల్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి అతడిని అత్యవసర చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.