ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ

ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతు ఉన్న హెజ్‌బొల్లా మధ్య శాశ్వత కాల్పుల విరమణ జరగాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్షించారు. ఇరుపక్షాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని, శాంతి చర్చల్లో ఇరాన్ చురుకుగా పాల్గొంటోందని ఆయన తన 'ట్రూత్' సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. 'ఇజ్రాయెల్‌పై కాల్పులు ఆపేందుకు హెజ్‌బొల్లా అంగీకరించింది. అలాగే ఇజ్రాయెల్ కూడా హెజ్‌బొల్లాపై దాడులు నిలిపివేయడానికి ఒప్పుకుంది. ఇది ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి. ఇది శాశ్వతంగా కొనసాగాలని ఆశిస్తున్నాను' అని ట్రంప్ తెలిపారు.

సంబంధిత పోస్ట్