ఇజ్రాయెల్, సిరియా నాయకులు ఇటీవల జరిగిన భారీ దాడుల తరువాత కాల్పుల విరమణకు అంగీకరించారు. అమెరికా రాయబారి టామ్ బారక్ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు, సిరియా కొత్త నాయకుడు అహ్మద్ అల్-షరా మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందానికి టర్కీ, జోర్డాన్ దేశాలు కూడా మద్దతు తెలిపాయి. ఆయుధాలు విసిరేసి, సిరియాలో శాంతి, ఐక్యతతో కొత్త గుర్తింపు ఏర్పరుచుకుందాం అని టామ్ బారక్ కోరారు.