కల్వకుంట్ల కవిత ఇటీవల ప్రకటించిన టీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేసింది. మొదట 'తెలంగాణ రాష్ట్ర సేన' అని పేరు పెట్టగా, దానికి బదులుగా 'తెలంగాణ రక్షణ సేన' (టీఆర్‌ఎస్) పేరును ఈసీ ఆమోదించింది. ఈ మేరకు పార్టీ అధినేత్రికి అధికారులు లేఖ అందజేశారు. ఈ నెల 25న జరిగిన సమావేశంలో కవిత తన కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించారు.