ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో సినీ తారలు కూడా పాల్గొంటున్నారు. ముంబయిలో లాల్బాగ్చా రాజాను దర్శించుకున్న రణ్వీర్ సింగ్, రణ్బీర్ కపూర్, అలియా భట్ తమ సేవా కార్యక్రమాలను వివరించారు. రణ్వీర్ 1000 మంది బాలికలకు విద్యను అందిస్తానని, రణ్బీర్, అలియా ముంబయిలోని 20 పాఠశాలలను పునరుద్ధరిస్తామని తెలిపారు. అంతకుముందు, రామ్చరణ్ 1000 మంది మహిళలకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తానని ప్రకటించారు.