132 అడుగుల సెల్ టవర్‌తో సహా జనరేటర్ మాయం

బీహార్‌లోని బక్సర్ జిల్లాలో దొంగలు ఏకంగా 132 అడుగుల ఎత్తైన సెల్ ఫోన్ టవర్‌ను, దానితో పాటు భారీ జనరేటర్, విలువైన టెలికాం సామగ్రిని దొంగిలించారు. నిరంతరాయంగా టెలికాం సేవలు అందిస్తున్న ఈ టవర్ అదృశ్యం కావడంతో టెలికాం కంపెనీ అధికారులు, సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వింత దొంగతనం ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్