పెరిగనున్న సిమెంట్ ధరలు

దేశవ్యాప్తంగా సిమెంట్ ధరలు రేపటి నుంచి భారీగా పెరగనున్నాయి. సిమెంట్ కంపెనీలు బస్తాపై రూ. 30 నుంచి రూ. 50 వరకు ధరలను పెంచుతున్నట్లు డీలర్లకు సమాచారం అందించాయి. దీంతో 50 కేజీల సిమెంట్ బస్తా ధర సుమారు రూ. 360కి చేరనుంది. రవాణా ఖర్చులు, ముడి సరుకుల ధరల పెంపు దీనికి కారణాలుగా తెలుస్తున్నాయి. ధరల పెంపు నేపథ్యంలో సిమెంట్ కంపెనీలు మార్చి 31న కొత్త బుకింగ్‌లను నిలిపివేసి, మార్చి 30 వరకు పాత ధరలపై ఆర్డర్లు తీసుకున్నాయి. రేపటి నుంచి పెరిగిన ధరలతోనే బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.

సంబంధిత పోస్ట్