త్వరలో కేంద్రం జీఎస్టీ శ్లాబులు తగ్గించనున్న నేపథ్యంలో సిమెంట్ కంపెనీలు, వ్యాపారులు భారీగా ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బస్తాకు రూ.30-40 వరకు పెంచే అవకాశమున్నట్లు వినిపిస్తోంది. ప్రస్తుతం సిమెంట్‌పై ఉన్న 28 శాతం జీఎస్టీ 18 శాతానికి తగ్గే అవకాశం ఉంది. దీంతో వినియోగదారులకు ఊరట కలగకుండా ఉండేందుకు, తమ లాభాలను పెంచుకోవడానికి ముందుగానే ధరలు పెంచుతున్నట్లు సమాచారం.