కొత్త ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి నిర్మాణ ఖర్చు మరింత భారం కానుంది. ఈ నెల 5వ తేదీ నుంచి సిమెంట్ తయారీ కంపెనీలు ధరలు పెంచేందుకు సిద్ధమయ్యాయి. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, సిమెంట్ బస్తాపై రూ.30 నుంచి రూ.40 వరకు పెంచాలని నిర్ణయించారు. ఇది అమల్లోకి వస్తే తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు సుమారు 10శాతం వరకు పెరగనున్నాయి. ముడిసరుకు, ప్యాకేజింగ్, రవాణా ఖర్చులు పెరగడమే ఈ ధరల పెంపునకు ప్రధాన కారణమని తెలుస్తోంది.