వంటగ్యాస్ ఈకేవైసీ తుది గడువుపై కేంద్రం క్లారిటీ

వంటగ్యాస్ ఈకేవైసీపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దీనికి ఎలాంటి డెడ్‌లైన్ విధించలేదని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చమురు సంస్థలు గానీ.. కేంద్ర ప్రభుత్వం గానీ ఎలాంటి తుది గడువు విధించలేదని కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీ స్పష్టం చేశారు. ఎల్‌పీజీ ఏజెన్సీల్లోనే కచ్చితంగా ఈకేవైసీ నమోదు చేయాలనే నిబంధనేదీ లేదని వెల్లడించారు. వినియోగదారులకు కంపెనీలు ఎలాంటి అసౌకర్యం కలిగించబోవని తెలిపారు.

సంబంధిత పోస్ట్