నికోటిన్‌ పౌచ్‌ల అక్రమ విక్రయాలపై కేంద్రం ఉక్కుపాదం

సిగరెట్లకు ప్రత్యామ్నాయంగా వినియోగించే ‘నికోటిన్‌ పౌచ్‌’ల అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. యువత, పిల్లలపై వీటి వల్ల ఆరోగ్యపరమైన దుష్ప్రభావాలు ఉంటాయని పేర్కొంది. పొగాకు లేకుండా నికోటిన్‌తో తయారయ్యే ఈ చిన్న ప్యాకెట్లను పెదవి కింద ఉంచుకుని వినియోగిస్తారు. భారత్‌లో వీటి విక్రయాలకు కేంద్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ కొన్ని అంతర్జాతీయ బ్రాండ్ల నికోటిన్‌ పౌచ్‌లు అక్రమంగా దేశంలోకి రవాణా అవుతూ, ఆన్‌లైన్‌లో, స్థానిక టొబాకో దుకాణాల్లో విక్రయిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕