టీవీల్లో కనిపించే బర్గర్, పిజ్జా వంటి జంక్ ఫుడ్ ప్రకటనలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. వినియోగదారులను, ముఖ్యంగా పిల్లలను తప్పుదోవ పట్టించే ప్రకటనలపై కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (CCPA), ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI) నిఘా పెంచాయి. అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు కలిగిన ఆహార పదార్థాలను ఆరోగ్యకరమైనవిగా చిత్రీకరించడాన్ని అడ్డుకోవాలని, పోషక విలువల గురించి నిజాయితీగా చెప్పాలని కంపెనీలను హెచ్చరించింది. ఈ నిబంధనలను అతిక్రమిస్తే భారీ జరిమానాలు, నిషేధాలు తప్పవని స్పష్టం చేసింది.