దేశంలో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తోన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దేశంలో ఇంధన కొరత ఎక్కడా లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. వెస్ట్ ఆసియాలో ఉద్రిక్తతలు, ఇటీవల పెరిగిన ధరల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న సమస్యలు చిన్నచిన్నవే తప్ప నిజమైన కొరత కాదని తెలిపింది. ధరల తేడాల కారణంగా ఇండస్ట్రియల్ వినియోగదారులు రిటైల్ బంక్‌ల నుంచి ఇంధనం కొనుగోలు చేయడంతో స్థానికంగా ఒత్తిడి పెరిగిందని వివరించింది. దేశంలో 22 రిఫైనరీలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని, అవసరానికి మించిన నిల్వలు ఉన్నాయని కేంద్రం వెల్లడించింది.