NEET రీ-ఎగ్జామ్‌పై కేంద్రం కఠిన నిఘా.. రంగంలోకి మోదీ!

నీట్‌ యూజీ 2026 రీ-ఎగ్జామ్‌పై కేంద్ర ప్రభుత్వం కఠిన నిఘా ఏర్పాటు చేసింది. ప్రశ్నాపత్రం లీక్ వివాదం నేపథ్యంలో జూన్‌ 21న నిర్వహించనున్న రీ-ఎగ్జామ్‌ ప్రక్రియను ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ప్రశ్నాపత్రాల తయారీ, ముద్రణ, రవాణా, భద్రత, పరీక్షా కేంద్రాలకు పంపిణీ వరకు ప్రతి దశను పీఎంఓ అధికారులు నేరుగా మానిటర్ చేయనున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాగా, దేశవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్