కిరోసిన్ పంపిణీకి కేంద్రం సిద్ధం.. పెట్రోల్ బంకుల ద్వారా?

యుద్ధం నేపథ్యంలో గ్యాస్, పెట్రోల్ కొరత ఏర్పడటంతో దేశంలో కిరోసిన్ వినియోగాన్ని అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. పెట్రోల్ బంకుల్లో తాత్కాలికంగా 60 రోజులపాటు దీన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి జిల్లాలో 2 బంకులు 5 వేల లీటర్ల కిరోసిన్‌ను నిల్వ చేసుకునేలా నిబంధనలు సడలించింది. అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కిరోసిన్ సరఫరా చేయనుంది. పీఎన్‌జీ కోసం శనివారం 6 వేల మంది స్వచ్ఛందంగా ఎల్‌పీజీ కనెక్షన్లు వదులుకున్నట్లు కేంద్రం తెలిపింది.

సంబంధిత పోస్ట్