సమ్మక్కసాగర్ ప్రాజెక్ట్ డీపీఆర్ తిరస్కరించిన కేంద్రం

TG: ములుగు జిల్లా తుపాకుల గూడెంలోని సమ్మక్కసాగర్ ప్రాజెక్ట్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌ను కేంద్రం తిరస్కరించింది. ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు లేకపోవడం, నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో, అప్రైజల్ ప్రక్రియ నుంచి ఈ ప్రతిపాదనను తొలగిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ఈ బ్యారేజీ ద్వారా నీటిని దేవాదుల ఎత్తిపోతల పథకానికి తరలించి, తద్వారా ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు సాగునీరు అందించాలనేది తెలంగాణ ప్రభుత్వ ప్రధాన ప్రణాళిక.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕