కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగ్ సహారా పథకం కింద కృత్రిమ అవయవాలు, సహాయక పరికరాల ఉత్పత్తి పెంచేందుకు అలిమ్‌కోకు మద్దతు ఇస్తామని, ఏఐ ఆధారిత పరిశోధన, అభివృద్ధిలో పెట్టుబడులు పెంచుతామన్నారు. ప్రధానమంత్రి దివ్యశ కేంద్రాలను బలోపేతం చేసి, సహాయక టెక్నాలజీ మార్ట్‌ల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. మానసిక ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఉత్తర భారతంలో నిమ్హాన్స్-2 ఏర్పాటు చేయడంతో పాటు జార్ఖండ్, అస్సాంలోని జాతీయ మానసిక ఆరోగ్య సంస్థలను అప్‌గ్రేడ్ చేస్తామని ప్రకటించారు.