పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్, LPG ధరలను పెంచుతారనే వార్తలను కేంద్రం మరోసారి ఖండించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా క్రూడాయిల్, LPG, PNG దిగుమతులు ప్రభావితం అయినప్పటికీ, దేశంలో సరిపడినంత ఇంధన నిల్వలు ఉన్నాయని, ధరలు పెంచడం లేదని పెట్రోలియం మినిస్ట్రీ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ భరోసా ఇచ్చారు. ప్రజలెవరూ భయాందోళనలకు గురికావొద్దని ఆమె సూచించారు.