పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్రం కీలక ప్రకటన

ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుతున్న నేపథ్యంలో భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. బ్రెంట్ క్రూడ్ ధరలు ఘర్షణలకు ముందు స్థాయికి చేరుకున్నాయని, ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే ఇంధన ధరలపై సమీక్షిస్తామని తెలిపారు. అయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గతంలో అధిక ధరలకు కొనుగోలు చేసిన ముడి చమురునే ప్రస్తుతం ప్రాసెస్ చేస్తున్నందున వెంటనే ధరలు తగ్గించడం సాధ్యం కాదన్నారు. అంతర్జాతీయ చమురు ధరలు స్థిరంగా ఉంటే భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్