యూజర్‌నేమ్ ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన ఆందోళనలకు వాట్సాప్ స్పందించింది. ప్రస్తుతం యూజర్‌నేమ్‌లను రిజర్వ్ చేసుకునే అవకాశం మాత్రమే కల్పించామని, మెసేజింగ్ సేవ ఇంకా ప్రారంభం కాలేదని స్పష్టం చేసింది. ఈ ఫీచర్‌తో మొబైల్ నంబర్‌ను వెల్లడించకుండానే కనెక్ట్ అవ్వొచ్చని, అయితే ఇది తప్పనిసరి కాదని తెలిపింది. నకిలీ ఖాతాలు, మోసాలపై భద్రతా చర్యలు అమలు చేస్తున్నామని, ప్రముఖులు, ప్రభుత్వ సంస్థల యూజర్‌నేమ్‌లను దుర్వినియోగం కాకుండా కాపాడుతామని వాట్సాప్ వివరణ ఇచ్చింది.