TG: బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని BRS నేత హరీశ్ రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించి మాట్లాడారు. రేవంత్ పెదవులు మూసుకోవడం వల్ల చంద్రబాబు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లు అయ్యిందని మండిపడ్డారు. లోపాయికార ఒప్పందం చేసుకొని ప్రాజెక్టు కోసం రేవంత్ సహకరిస్తున్నాడని ఆరోపించారు. ఢిల్లీలో పవర్ ఉంది అని లోకేష్ ప్రాజెక్టు కట్టి తీరుతం అంటున్నారని చెప్పారు.