675 టన్నుల బంగారం కొన్న కేంద్ర బ్యాంకులు!

ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. 2026 జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు 675 టన్నుల పసిడిని కొనుగోలు చేశాయి. గతేడాదితో పోలిస్తే ఇది 6 శాతం అధికం. వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ నివేదిక ప్రకారం.. ఒక్క జులై–సెప్టెంబర్‌ త్రైమాసికంలోనే 321 టన్నుల బంగారం కొనుగోలు చేశాయి. చైనా, పోలాండ్‌ అధికారిక కొనుగోళ్లలో ముందున్నాయి. మరోవైపు ఆర్‌బీఐ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. సెప్టెంబర్‌ చివరి నాటికి భారత్‌ వద్ద 880.5 టన్నుల పసిడి నిల్వలున్నాయి. తొలి తొమ్మిది నెలల్లో నికర కొనుగోళ్లు కేవలం 0.3 టన్నులకే పరిమితమయ్యాయి.

సంబంధిత పోస్ట్

✕
✕