నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌సీడీసీ)కు రూ.2 వేల కోట్లు ఆర్థిక సాయం చేసేందుకు మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గ్రాంట్-ఇన్-ఎయిడ్ కింద నాలుగేళ్లపాటు దీన్ని కేంద్రం అందించనుంది. రుణాల కింద మరిన్ని నిధులు సమకూర్చుకోవడానికి ఎన్‌సీడీసీకి తాజా నిర్ణయం ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది.