WPLలోకి సీఎస్కే.. హింట్ ఇచ్చిన సీఈవో

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీ CSK మహిళల క్రికెట్ లోకి విస్తరించాలని యోచిస్తోంది. CSK సీఈవో కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ, 'వెంటనే కాకపోయినా, రాబోయే సంవత్సరాల్లో CSK విస్తరిస్తుంది. మా మొదటి లక్ష్యం మహిళల క్రికెట్. ఇతర క్రీడల్లోకి కూడా వెళ్తాం' అని తెలిపారు. ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో కొనసాగుతున్నాయి. 2023లో ప్రారంభమైన డబ్ల్యూపీఎల్ ఆదరణ పెరుగుతోంది.

సంబంధిత పోస్ట్