తిరుమలలో చాగంటికి అవమానం.. క్లారిటీ

ఏపీ ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు తిరుమలలో అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. ‘ఈ నెల 16న చాగంటి తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ప్రవచనాలు ఇచ్చేందుకు టీటీడీ ప్రొసీడింగ్స్ ఇచ్చింది. బయోమెట్రిక్ నుంచి దర్శనానికి వెళ్లే సదుపాయం ఉన్నప్పటికీ చాగంటి తిరస్కరించారు. సాధారణ భక్తుల తరహాలోనే దర్శనం చేసుకున్నారు. దీనిపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం’. అని టీటీడీ పేర్కొంది.

సంబంధిత పోస్ట్