మార్చి 18, 19న జాతీయ ఓబీసీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్లలో 50% బీసీ మహిళలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ జాతీయ స్థాయి సమావేశంలో బీసీ మహిళల సాధికారత, రిజర్వేషన్లు వంటి వివిధ అంశాలపై చర్చలు ఉంటాయి.