ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 46.3 ఓవర్లలో 231 చేసి 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. భారత బ్యాటర్‌లలో శుభ్‌మన్ గిల్ 101*(129) పరుగులతో రాణించగా.. రాహుల్ 41*, రోహిత్ 41, విరాట్ కోహ్లీ 22, శ్రేయాస్ 15, అక్షర్ 8 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో రిషాద్ 2 వికెట్లు తీయగా.. తస్మిన్, ముస్తాఫిజుర్ తలో వికెట్ తీశారు.