చాందీపుర వైరస్ నివారణకు పరిశుభ్రతే ప్రధాన ఆయుధమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇసుక ఈగలు పెరిగే తడి ప్రాంతాలు, గోడల పగుళ్లు, పేడ పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. పిల్లలు ఒళ్లు పూర్తిగా కప్పే దుస్తులు ధరించడం, దోమతెరలు, క్రిమిసంహారక స్ప్రేలు వినియోగించడం మంచిది. జ్వరం, వాంతులు, తీవ్రమైన నీరసం లేదా అసాధారణ ప్రవర్తన కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.