నా పార్టీ జెండాలో పసుపు రంగు ఉండటానికి కారణం చంద్రబాబు కాదు: కవిత

TG: తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండాలో పసుపు రంగు ఉండటంపై కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పసుపు రంగు భూమి పుట్టినప్పటి నుంచి ఉందని, దానిని కేవలం ఒక పార్టీకి మాత్రమే పరిమితం చేయడం సరికాదన్నారు. నిజామాబాద్ ప్రజలకు పసుపు ప్రత్యేక సెంటిమెంట్ అని, అక్కడ పసుపు సాగు విస్తృతంగా జరుగుతుందని చెప్పారు. పసుపు కుంకుమలు ప్రతి ఆడబిడ్డ జీవితానికి ప్రతీక అని, అందుకే తనకు ఆ రంగు ఎంతో ఇష్టమన్నారు. తెలంగాణలో వెలుగు, సుభిక్షం, సమృద్ధికి సంకేతంగా జెండాలో పసుపు రంగు చేర్చినట్లు తెలిపారు. తన పార్టీ జెండాలోని పసుపు రంగుకు చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్