టాటా సన్స్ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్ నియామకం చెల్లదని టాటా ట్రస్ట్స్ స్పష్టం చేసింది. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రకారం, కేవలం డైరెక్టర్ల మెజారిటీతో బోర్డు నిర్ణయాలు తీసుకోలేదని, బోర్డులో ఉన్న ఇద్దరు నామినీ డైరెక్టర్ల మద్దతు తప్పనిసరి అని తెలిపింది. చంద్రశేఖరన్ నియామక తీర్మానానికి వ్యతిరేకంగా ఒక డైరెక్టర్ ఓటు వేయడంతో, ఆ తీర్మానం పూర్తిగా ఆమోదం పొందలేదని టాటా ట్రస్ట్స్ పేర్కొంది.