TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. శుక్రవారం ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలంతా ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థి కోసం తీవ్రంగా కృషి చేస్తే, బీజేపీ నేతలు మాత్రం పార్టీ అభ్యర్థిని ఎలా ఓడించాలనే దానిపై పనిచేశారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కనీసం డిపాజిట్ కూడా రాలేదని, దీనిపై ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు.