జీఎస్టీ నిబంధనల్లో మార్పులు.. వ్యాపారులకు ఊరట

నవంబర్ 1, 2026 నుంచి జీఎస్టీ నిబంధనల్లో కీలక మార్పులు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలకు అనుగుణంగా విక్రయాల తర్వాత డిస్కౌంట్లకు సంబంధించిన పన్ను సర్దుబాట్లు, క్లెయిమ్ ప్రక్రియలను సరళతరం చేసింది. ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ఎదుర్కొనే వ్యాపారులకు తాత్కాలిక రీఫండ్లు వేగంగా అందేలా కొత్త మార్గదర్శకాలు అమలు కానున్నాయి. అలాగే రైతులకు మేలు చేస్తూ పునర్వినియోగ ట్రాక్టర్ టైర్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. ఇ-కామర్స్ గిడ్డంగుల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పించారు.

సంబంధిత పోస్ట్

✕
✕